: అమ్మాయిలూ...కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నారా?... అయితే,జాగ్రత్త!

అమ్మాయిలు గంటల తరబడి కంప్యూటర్ గేమ్స్ ఆడితే బరువు పెరుగుతారని ఓ పరిశోధన తెలుపుతోంది. తాజా పరిశోధనల్లో ఈ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ప్రతిరోజు కనీసం గంటపాటు కంప్యూటర్ గేమ్స్ ఆడే అమ్మాయిలు, అసలు ఈ గేమ్స్ ఆడని అమ్మాయిల కంటే బరువు ఎక్కువగా ఉంటారని పరిశోధకులు వెల్లడించారు. 20 నుంచి 24 ఏళ్లలోపు ఉన్న 2500 మంది అమ్మాయిలపై పరిశోధనలు నిర్వహించామని వారు చెప్పారు. ప్రతి రోజూ అమ్మాయిలు మెయిలింగ్, ఛాటింగ్, గేమ్స్ తదితరాలపై గడిపే సమయం వారి బాడీ మాస్ ఇండెక్స్ పై ప్రభావం చూపుతుందని వారు వివరించారు. గేమ్స్ పై దృష్టి పెట్టే వారు, ఆడని వారి కంటే 3.7 కేజీల బరువు పెరుగుతారని, దీనిపై ఐదేళ్లపాటు అధ్యయనం జరిపిన పరిశోధకులు తేల్చి చెప్పారు. దీనికి మగవాళ్లు మినహాయింపని వారు చెప్పారు. మగవారిలో ఎలాంటి మార్పులు తాము గమనించలేదని వారు స్పష్టం చేశారు.

More Telugu News