: నిత్యమూ ఆన్ లైన్లో గడిపేవారికి ఎస్బీఐ ఇస్తున్న గిఫ్ట్

ఎల్లప్పుడూ ఆన్ లైన్లో గడిపే నేటి తరం నెటిజన్లకు లాభదాయకంగా ఉండేలా, దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'సింప్లీ క్లిక్' పేరిట సరికొత్త కార్డును విడుదల చేసింది. ఇండియాలోని ఈ-కామర్స్ రంగాన్ని ఏలుతున్న ప్రధాన సంస్థలు అమేజాన్, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, ఫ్యాబ్ ఫర్నిష్, ఫుడ్ పాండా, లెన్స్ కార్ట్, ఓలా క్యాబ్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ కార్డును విడుదల చేసినట్టు ఎస్బీఐ కార్డ్ చీఫ్ విజయ్ జసూజా వెల్లడించారు. ఈ కార్డును వాడి, తాము ఒప్పందం చేసుకున్న సైట్ల ద్వారా షాపింగ్ చేస్తే పలు ప్రోత్సాహకాలు లభిస్తాయని వివరించారు. సాదారణ కార్డులతో పోలిస్తే 5 రెట్లు అధికంగా రివార్డు పాయింట్లు లభిస్తాయని, కొన్ని విభాగాల్లో షాపింగ్ పై 10 రెట్లు అదనపు రివార్డును పొందవచ్చని ఆయన తెలిపారు. సాలీనా రూ. 2 లక్షలు ఖర్చు పెట్టిన వారికి కచ్చితంగా 2 శాతంగా, రూ. 4 వేలు విలువైన ఓచర్లు లభిస్తాయని తెలిపారు. ఈ కార్డు పొందేందుకు నామమాత్రంగా రూ. 499 ఫీజు చెల్లించాలని, ఆ వెంటనే అమేజాన్ లో రూ. 500 విలువైన ఈ-గిఫ్ట్ పొందవచ్చని, రూ. లక్ష విలువైన షాపింగ్ చేస్తే ఈ రూ. 499ని వెనక్కు ఇచ్చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోలు బంకుల్లోను 2.5 సర్ చార్జ్ లేకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపారు.

More Telugu News