: దూసుకొచ్చే రైళ్ల ముందు నిలబడి సెల్ఫీలు!

సెల్ఫీల పిచ్చి ఎంత పనైనా చేయిస్తుంది. రైలుపై నిలబడి ఒకరు, కొండ అంచున నిలబడి మరొకరు .. ఇలా ఆకర్షించే విధంగా ఏదో ఒక రకమైన సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఆహా! ఓహా! అనుకుంటూ.. వచ్చిన లైక్ లు చూసి గర్వంగా ఫీలవడం పరిపాటి అయింది. సెల్ఫీలపై మోజుతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారి సంఖ్యా పెరుగుతోంది. తూర్పు చైనాలోని నాన్జింగ్ నగరంలో ఇప్పుడు ఒక కొత్త సెల్ఫీ ట్రెండ్ మొదలైంది. అదేమిటంటే, నాన్జింగ్ నగరంలో ఒక చోట సొరంగం ఆకారంలో పెరిగిన చెట్లు, వాటి మధ్య రైలు పట్టాలు, వాటిపై ప్రయాణించే రైళ్లతో ఆ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. దీంతో చాలా మంది సందర్శకులు, ముఖ్యంగా ప్రేమికులు అక్కడికి రావడం ఎక్కువైంది. దూసుకొచ్చే రైళ్లముందు నిలబడి సెల్ఫీలు దిగుతున్న సంస్కృతి పెరుగుతోంది. ఇటీవల ఓ యువతి సరదా ఆమె ప్రాణాలను కూడా తీయబోయింది. ఆ సమయంలో రైలు డ్రైవర్ చూసి రెండుసార్లు షడన్ బ్రేక్ వేసి రైలును ఆపి, యువతి ప్రాణాలు నిలిపాడు. సరదా అనుకుంటున్నారు కానీ, జరగరాని సంఘటన ఏదన్నా జరిగితే ఏంటి పరిస్థితి అని విమర్శిస్తున్న వారు లేకపోలేదు.

More Telugu News