: మీకు బోర్ కొడుతోందో లేదో మీ స్మార్ట్ ఫోన్ ఇట్టే చెప్పేస్తుంది!

మీకు బోర్ కొడుతుందో, లేదో మీ స్మార్ట్ ఫోన్ ఇట్టే చెప్పేస్తుందట. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు మనకు సంబంధం లేకుండా మన మూడ్ ఎలా ఉందో తెలుసుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఇలాంటి కోవకే 'బోర్డ్ యాప్' వస్తుంది. స్మార్ట్ ఫోన్ మనం వినియోగించిన విధానం తెలుసుకుని మనం బోర్ ఫీలవుతున్నామో, లేదో తేల్చి చెబుతుందని పరిశోధకులు చెప్పారు. రోజులో చివరి మెసేజ్, లేదా కాల్ ఎలా చేశామో గుర్తించి, దానిని బట్టి ఈ యాప్ మన మూడ్ ను చెబుతుందట. బోరింగ్ మూడ్ ను కనిపెట్టే ఆల్గారిథమ్ ను కనిపెట్టినట్టు పరిశోధకులు వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే వారి ఫోన్లలో ఈ ఆల్గారిథమ్ యాప్ ను నిక్షిప్తం చేసి, పరీక్షించామని చెప్పారు. బోర్ ఫీలయ్యేవారికి బోర్డ్ యాప్ ద్వారా ఓ ఆర్టికల్ ఇచ్చి అలెర్ట్ ఇచ్చామని చెప్పారు. నిజంగా బోర్ ఫీలైనప్పుడు బోర్డ్ యాప్ ను ఎక్కువ సార్లు క్లిక్ చేశారని పరిశోధకులు తెలిపారు.

More Telugu News