: మధుమేహానికి పెద్ద సవాలు నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడమే!: వైద్య శాస్త్రవేత్త థామస్

మధుమేహం పెద్ద సమస్యే అయినప్పటికీ... దాని గురించి ఎక్కువ వర్రీ కావాల్సిన అవసరం లేదని ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, బేకర్ ఐడీహెచ్ హార్ట్ అండ్ డయాబెటీస్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన మెర్లిన్ థామస్ అన్నారు. మందులు, సమతుల ఆహారం, శారీరక శ్రమ ఈ మూడింటినీ సమన్వయం చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చని సూచించారు. డయాబెటీస్ బారిన పడేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆంక్షలు విధించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని... జబ్బుపై సరైన అవగాహన కలిగి ఉండి, దాన్ని నియంత్రించుకోవడమే కీలకమని పేర్కొన్నారు. తన పుస్తకం 'అండర్ స్టాండింగ్ టైప్ 2 డయాబెటీస్'లో ఈ వివరాలను తెలిపారు. రక్తంలోని గ్లూకోజును కంట్రోల్ లో ఉంచుకుంటూ, ఆరోగ్యకరంగా ఎలా జీవించాలో ఆ పుస్తకంలో వివరించారు. 2030 కల్లా భారత్ లో ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ ఉంటుందని థామస్ చెప్పారు. మధుమేహానికి అతిపెద్ద సవాలు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ కాదని... నడుం చుట్టుకొలత పెరగడానికి కారణమయ్యే కొవ్వే అతి పెద్ద సమస్య అని తెలిపారు. ఈ కొవ్వును తగ్గించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

More Telugu News