: ఇక ఫేస్ బుక్ లోనూ ఆన్ లైన్ షాపింగ్... ‘ఎం’ పేరిట త్వరలో కొత్త సేవలు

సోషల్ నెట్ వర్కింగ్ లో దూసుకెళుతున్న ఫేస్ బుక్ త్వరలో మరిన్ని సేవలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటిదాకా చాటింగ్, ఉచిత కాల్స్ కే పరిమితమైన ఫేస్ బుక్ త్వరలో తన వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్ ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఫేస్ బుక్ మెసెంజర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ నిన్న ఈ విషయంపై ఓ స్పష్టమైన ప్రకటన చేశాడు. ఫేస్ బుక్ లో ఆన్ లైన్ విక్రయాల కోసం ప్రవేశపెడుతున్న ఈ సేవలకు ‘ఎం’ అని నామకరణం చేశామని ఆయన తెలిపారు. ‘‘ఫేస్ బుక్ మెసెంజర్ లో ‘ఎం’ పేరిట కొత్తగా ఆన్ లైన్ విక్రయాలను ప్రవేశపెడుతున్నాం. మీ ప్రియమైన వారికి బహమతులు కొనుగోలు చేసేందుకు మా వంతు సహకారం అందిస్తాం. ‘ఎం’ సేవల ద్వారా హోటల్ అడ్వాన్స్ బుకింగ్సే కాక అడ్వాన్స్ ట్రావెల్ బుకింగ్స్ కూడా చేసుకునే అవకాశం కల్పిస్తాం. ప్రస్తుతం ‘ఎం’ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తాం’’ అని ఆయన తెలిపారు.

More Telugu News