: ఆరు దాటితే నల్లమలలోకి నో ఎంట్రీ

ఏపీలో వన్యమృగాల సంరక్షణ కోసం అటవీశాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత నల్లమల అడవిలోకి వాహనాల ప్రవేశాలను నిలిపివేయాలని నంద్యాల డీఎఫ్ఓ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. నల్లమలలో పాములేటయ్య, గరుడాద్రి తదితర పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఆలయాలను దర్శించుకున్న అనంతరం చీకటి పడిన తర్వాత కూడా భక్తులు వస్తూనే ఉంటారు. దీంతో అడవిలోని జంతువులకు ఇబ్బందిగా ఉంటోంది. ఈ క్రమంలోనే అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయాలకు వెళ్లిన భక్తులు సాయంత్రానికి అహోబిలం చేరుకోవాలని అధికారులు తెలిపారు. రాత్రి సమయాల్లో కూడా అటవీ ప్రాంతంలో సంచరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News