: జగన్ తో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు...ఫోన్ మంతనాల వార్తపై సీఎం రమేశ్ ఫైర్

విద్యుత్ ఉద్యోగుల వేతనాల విడుదలకు సంబంధించి తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడానన్న వార్తలపై టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని ఆయన నిన్న సదరు వార్తను ప్రచురించిన దినపత్రికకు తేల్చిచెప్పారు. ‘‘నాకు జగన్ తో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? కడప జిల్లాలో మేం రాజకీయ ప్రత్యర్థులం. ఆయనకు నేను ఫోన్ చేయలేదు. మాట్లాడలేదు. కొంతకాలం కిందట విద్యుత్ ఉద్యోగులు నన్ను ఢిల్లీలో కలిశారు. నాతో పాటు మిగిలిన ఎంపీలను కలిశారు. వారిని వెంట తీసుకుని కేంద్ర హోం శాఖ మంత్రి వద్దకు వెళ్లి ఆయనకు సమస్య వివరించాం. ఆ తర్వాత వారెవరూ నా దగ్గరకు రాలేదు. నేనెవరికీ ఫోన్ చేయలేదు. మేం అధికారంలో ఉన్నాం. జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయనకు నేనెందుకు ఫోన్ చేస్తాను?’’ అని ఆయన చెప్పారు.

More Telugu News