: కేంద్రం 'ఓకే' అంటేనే తెలంగాణకు నిధులు: వరల్డ్ బ్యాంక్

తెలంగాణ రాష్ట్రానికి రుణాలు ఇవ్వాలంటే, కేంద్రం నుంచి అనుమతి రావాల్సిందేనని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి పనుల నిమిత్తం, వివిధ రంగాల్లో ఆరు కొత్త ప్రాజెక్టులకు దాదాపు రూ. 58,500 కోట్లు రుణంగా కావాలని వరల్డ్ బ్యాంకు ఎదుట కేసీఆర్ సర్కారు ప్రతిపాదనలు పెట్టగా, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే, రుణం ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కాగా, తాగునీటి పథకాలకు రూ. 25 వేల కోట్లు, హైదరాబాద్ లో నీటి సరఫరాకు రూ. 14 వేల కోట్లు, విద్యుత్ సరఫరాలో లోపాలను అధిగమించేందుకు రూ. 4 వేల కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 7 వేల కోట్లు, మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు రూ. 3,500 కోట్లు, హైదరాబాద్, వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్ నిమిత్తం రూ. 5 వేల కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను తొలుత కేంద్రానికి పంపాలని సలహా ఇచ్చిన వరల్డ్ బ్యాంక్ అధికారులు, రాష్ట్ర అవసరాలు పరిశీలించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

More Telugu News