: కారు కొనాలంటే అది చూపించాల్సిందే... కాలుష్య నివారణకు చర్యలు

ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వాయు కాలుష్యం కారణంగా రానున్న పదేళ్లలో వాతావరణంలో గణనీయమైన మార్పులు సంభవించబోతున్నాయన్న శాస్త్రవేత్తల హెచ్చరికలతో అధికారులు కళ్లుతెరుస్తున్నారు. ఆగ్రా ఆర్టీఏ అధికారులు కాలుష్య నివారణకు నడుంబిగించారు. దేశంలోని అత్యంత కాలుష్య కారక నగరాల్లో ఆగ్రా 19వ స్థానంలో ఉండడంపై ఆందోళన చెందిన అధికారులు కారు కొనాలంటే పార్కింగ్ ప్రదేశాన్ని చూపించాలనే నిబంధన పెట్టారు. పార్కింగ్ స్థలం ఉంటే రొడ్డు మీద ఎక్కడపడితే అక్కడ కార్లను నిలిపేసే అవకాశం ఉండదని, భద్రతతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఏటా 80 వేల కొత్త వాహనాలు ఆగ్రాలో రిజిస్టర్ అవుతున్నాయి. దీంతో ఏటికేడు కాలుష్యం పెరిగిపోతోంది. నిబంధనలు కఠినతరం చేస్తే కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చని వారు భావిస్తున్నారు. ఇప్పటికే బొగ్గు మండించే కంపెనీలకు సీఎన్జీ వాడకం మొదలు పెట్టాలని సలహా ఇచ్చారు.

More Telugu News