: ఆండ్రాయిడ్ లాక్ ప్యాట్రన్ తెలుసుకోవడం చాలా సులభం!

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ మరింత సెక్యూర్డ్ గా ఉండాలని 'లాక్ ప్యాట్రన్' వాడుతున్నారా? అది ఇతరులు ఎవరూ కనుక్కోలేరని భావిస్తున్నారా? మీ అంచనా తప్పు. ఆండ్రాయిడ్ లాక్ ప్యాట్రన్ (ఏఎల్పీ), యూజర్లు అనుకున్నంత రక్షణాత్మకం ఏమీ కాదని, చాలా సులువుగా లాక్ ఓపెన్ చేయవచ్చని కొత్త రీసెర్చ్ వెల్లడించింది. ఒక ఏఎల్పీ కనీసం నాలుగు డాట్ లు, గరిష్ఠంగా 9 డాట్ లతో ఉంటుంది. మొత్తం సుమారు 4 లక్షలకు పైగా విభిన్న రకాల కాంబినేషన్స్ అందుబాటులో ఉంటాయి. కానీ ఓ 30 నుంచి 40 రకాల ప్యాట్రన్స్ మాత్రమే వాడుతున్నారు. నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ ఎఎల్పీలపై పరిశోధన చేసింది. 44 శాతం యూజర్లు, ప్యాట్రన్ లోని 9 డాట్ లలో ఎడమ వైపు పై కార్నర్ లో ఉన్న డాట్ నుంచి లాక్ కీని స్టార్ట్ చేస్తున్నారు. 77 శాతం మంది ఏదో ఒక కార్నర్ నుంచి లాక్ కీని ఆపరేట్ చేస్తున్నారు. ఆంగ్ల వర్ణమాలలోని 'ఎన్', 'ఓ', 'ఎస్' అక్షరాలు అత్యధికుల పాస్ కోడ్ గా ఉన్నాయి. అత్యధికులు కేవలం నాలుగు డాట్ లను మాత్రమే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ను మరింత సెక్యూర్ చేసుకోవడానికి సెట్టింగ్స్ లోకి వెళ్లి 'మేక్ ప్యాట్రన్ విజబుల్' ఆప్షన్ ను 'టర్న్ ఆఫ్' చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరింత వైవిధ్యభరితంగా ఉండేలా 'కీ' సెట్ చేసుకోవాలని చెబుతున్నారు.

More Telugu News