: వ్యక్తిగత సెర్చ్ ఇంజిన్ రూపొందించిన 16 ఏళ్ల ఎన్ఆర్ఐ... గూగుల్ ను సవాల్ చేస్తున్నాడు!

అంతర్జాలంలో సెర్చ్ ఇంజిన్లకు రారాజు గూగుల్. ఏదైనా విషయం గురించి వెతికిన క్షణాల్లోనే మనముందు ఉంచుతుంది. కానీ 16 ఏళ్ల అన్మోల్ టురెల్ అనే ఎన్ఆర్ఐ గూగుల్ అథారిటీని సవాల్ చేస్తున్నాడు. భారత సంతతికి చెందిన కెనడియన్ పౌరుడైన అన్మోల్ ఓ వ్యక్తిగత సెర్చ్ ఇంజిన్ ను రూపొందించాడు. గూగుల్ కంటే అది 47 శాతం చాలా నిర్దిష్టమైనదని, సగటున 21 శాతం మరింత కచ్చితమైందని చెబుతున్నాడు. 10వ తరగతి చదువుతున్న అతను కొన్ని నెలల నుంచి తన సెర్చ్ ఇంజిన్ ప్రాజెక్టుపై పని చేస్తున్నాడు. ఇందుకోసం అన్మోల్ దాదాపు 60 గంటల కోడ్ తీసుకుని సెర్చ్ ఇంజిన్ కు రూపకల్పన చేశాడు. ఇదంతా 13 నుంచి 18 ఏళ్ల విద్యార్థుల కోసం నిర్వహించిన గూగుల్ సైన్స్ ఫెయిర్ సబ్ మిషన్ పోటీలో భాగంగా చేశాడట. అయితే గతంలో అన్మోల్ కొన్ని రోజుల ఇంటర్న్ షిప్ కోసం బెంగళూరు వచ్చాడు. అప్పుడు గూగుల్ గురించి తెలుసుకుంటున్న సమయంలోనే తన వ్యక్తిగత సెర్చ్ ఇంజిన్ ను డిజైన్ చేసుకున్నాడు. దాన్ని మరింత ముందు దశకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేశాడు.

More Telugu News