: యువకుడిని జైలుపాల్జేసిన సెల్ఫీ మోజు!

సోషల్ మీడియాలో హల్ చల్ చేయాలనే తాపత్రయం సెల్ఫీలకు ఎక్కడలేని క్రేజు తీసుకొచ్చింది. దీంతో విభిన్నంగా సెల్పీలు దిగేందుకు యువత మొగ్గుచూపుతోంది. పర్యవసానంగా పెను ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సార్లు సెల్ఫీ మోజుతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ సెల్ఫీ యువకుడిని జైలు పాలుచేసింది. వివరాల్లోకి వెళ్తే...అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన డేవిడ్ కార్నౌచ్, టెన్నెస్సీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జూలై 4 ముందు రోజు ప్రఖ్యాత బ్రూక్లిన్ బ్రిడ్జ్ బీమ్ పైకెక్కి ప్రమాదకరమైన రీతిలో సెల్పీ తీసుకున్నాడు. దీనిని ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేశాడు. ప్రమాదకరమైన రీతిలో తీసుకున్న ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ పొందింది. లైకులు, షేర్లతో హల్ చల్ చేసిన ఈ ఫోటో చివరికి పోలీసుల వద్దకు చేరింది. దీంతో ఇది భద్రతా సమస్యలు రేపే ఫోటో అని, దీనివల్ల మరింత మంది ఇలాంటి పనులు చేసేందుకు స్ఫూర్తి పొందే ప్రమాదం ఉందని భావించి అతనిపై కేసు నమోదు చేసి జైలుకి పంపించారు.

More Telugu News