: పరుగులు పెడుతున్న సాంకేతికత... పాఠాలు చెప్పనున్న రోబో

సాంకేతికత పరుగులు పెడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రతి పని యంత్రాలు చేసుకుపోతున్నాయి. రోబోల ఆగమనంతో ఇది మరింత వేగం పుంజుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద కంపెనీల్లో వివిధ రకాలైన విధులు నిర్వర్తించే రోబోలు, ఇకపై పాఠశాలల్లో సందడి చేయనున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించనున్నాయి. ఈ మేరకు పరిశోధనలు పూర్తయ్యాయి. ఆస్ట్రేలియాలోని స్విన్ బర్న్ యూనివర్సిటీ రోబో విద్యపై పరిశోధనలు చేసింది. రోబో విద్య వల్ల వచ్చే ఉపయోగాలపై వీరు అధ్యయనం చేశారు. దీంతో ఎంపిక చేసిన రెండు పాఠశాలల్లో ఫ్రాన్స్ కు చెందిన ఎన్ఈవో హ్యూమనాయిడ్ రోబోలతో పాఠాలు చెప్పించనున్నారు. ఈ రోబోలు మాట్లాడగలవని, డాన్స్ కూడా చేయగలవని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోబోలతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచనున్నట్టు వారు వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఉన్న సందేహాలకు ఈ రోబోలు పరిష్కారాలు సూచిస్తాయని వారు పేర్కొంటున్నారు.

More Telugu News