: స్నేహితురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేయబోయి, పోలీసు కేసులో బుక్కయిన ప్రియుడు!

తన స్నేహితురాలి ముందు వినూత్నంగా పెళ్లి ప్రస్తావన తీసుకురావాలని భావించాడో ప్రియుడు. అంతవరకూ బాగానే ఉంది. అందుకు ఎంచుకున్న విధానం మాత్రం ఆ యువకుడిని ఊచలు లెక్కించేలా చేసింది. ఈ ఘటన ఇస్తాంబుల్ లో జరిగింది. ప్రపోజ్ చేసేందుకు జాతీయ రహదారిపై తన స్నేహితులతో కలసి ఏడు కార్ల కాన్వాయ్ తో వచ్చి వాటిని అడ్డంగా నిలిపాడు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడున్న వారు ఎవరూ అప్పటికప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు కానీ, ఈ ఉదంతాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. వీటితో పాటు, అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆ యువకుడిని, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News