: ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్నారా?... అయితే, ఇది చదవండి

ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితం ఇంటర్నెట్ తో ముడిపడిపోయింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునే దాకా నెట్ తోనే గడిపేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగ రీత్యా కూడా ఇంటర్నెట్ కు అతుక్కుపోవాల్సిన స్థితి నేటి తరానిది. ఈ క్రమంలో, తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం వార్నింగ్ బెల్ మోగించింది. మితిమీరి ఇంటర్నెట్ వాడుతున్న వారిలో రోగ నిరోధక శక్తి బలహీనపడుతోందని స్పష్టం చేసింది. ఎక్కువ సమయం నెట్ లో గడిపే వారు తరచూ జలుబు, ఫ్లూ వంటి వాటితో బాధ పడుతున్నారని... దీనికి కారణం రోగ నిరోధక శక్తి సన్నగిల్లడమే అని వెల్లడించింది. నెట్ ను ఎక్కువ వాడటం వల్ల నిద్రలేమితో బాధ పడతారట. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సంక్రమిస్తాయట. అంతేకాదు... ధూమపానం, మద్యపానికి అలవాటయ్యే ప్రమాదం కూడా ఉందట. నెట్ ను మితిమీరి వాడేవారు... కొంత సేపు నెట్ కనెక్టివిటీ లేకున్నా ఒత్తిడికి లోనవుతారట. నెట్ అధికంగా వాడేవారిలో కార్టిసోల్ అనే హర్మోన్ మార్పులకు లోనవుతుందట... దాని ప్రభావమే ఇదంతా. సో, బీ కేర్ ఫుల్.

More Telugu News