: గూగుల్ కొత్త బాస్ గురించి తెలుసుకుందామా?

టెక్ దిగ్గజం గూగుల్ లో భారీఎత్తున జరుగుతున్న మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ప్రవాస భారతీయుడు సుందర్ పిచాయ్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆయన గురించిన మరింత సమాచారం మీకోసం. * తమిళనాడులో జన్మించిన సుందర్ ఖరగ్ పూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ విద్యను అభ్యసించారు. * స్టాన్ ఫోర్డ్ వర్శిటీ నుంచి ఎంఎస్, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిధిలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు. * గూగుల్ లో చేరకుముందు మేనేజ్ మెంట్ సేవలందిస్తున్న మెక్ కిన్సే కంపెనీ, అప్లయిడ్ మెటీరియల్ విభాగంలో ఇంజనీరుగా పనిచేశారు. * 2004లో గూగుల్ ప్రొడక్టు మేనేజ్ మెంటు విభాగంలో చేరి, విప్లవాత్మక గూగుల్ క్రోమ్ తయారీ టీమ్ కు నేతృత్వం వహించారు. * అనతికాలంలోనే వ్యవస్థాపకుల మెప్పు పొంది, ఫైర్ ఫాక్స్, గూగుల్ టూల్ బార్, డెస్క్ టాప్ సెర్చ్, గాడ్జెట్స్ రూపకల్పనలో భాగం పంచుకున్నారు. * సెప్టెంబర్ 2008లో క్రోమ్ వెబ్ బ్రౌజర్ ఆవిష్కరణ తరువాత సుందర్ వెనుదిరిగి చూడలేదు. మరో సంవత్సరం తరువాత నోట్ బుక్స్, డెస్క్ టాప్ లకు క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేసి సంస్థలో అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు. * ప్రపంచ స్మార్ట్ ఫోన్ రంగాన్ని మరో మలుపు తిప్పిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ రూపకల్పనలోనూ పాలు పంచుకున్నారు. * తనకన్నా ముందు చేరిన వారు ఒక్కొక్కరుగా సంస్థను వీడి వెళుతుంటే, ఆ పోస్టుల బాధ్యతలన్నీ చేపట్టి దూసుకెళ్లారు. * సుందర్ స్వతహాగా మృదు స్వభావి అని, తక్కువగా మాట్లాడతారని, లారీ పేజ్ కి కుడిభుజం వంటి వాడని యూఎస్ మీడియా అభివర్ణించింది.

More Telugu News