: భూమిపై నుంచి చూడలేని చంద్రుడి అవతలి వైపు ఎలా ఉంటుందో తెలుసా?... అయితే, చూడండి!

చందమామ... వెన్నెల రాత్రుల్లో ఆరుబయట పడుకొని చందమామను చూస్తూ, దానిపై ఓ చెట్టు, చెట్టు కింద అవ్వ కూర్చుని ఉందని ఊహించుకుంటూ నిద్రపోయిన సందర్భాలు పలువురికి అనుభవమే. ఆ సమయంలో అందరికీ వచ్చే ఇంకో సందేహం, చందమామకు ఆవలి వైపున ఏముంది? ఎలా కనిపిస్తుంది? దీనికి సమాధానం అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఇచ్చింది. భూమిపై నుంచి చూడలేని చంద్రుడి అవతలివైపు చిత్రాలను, వీడియోను విడుదల చేసింది. భూమికి, సుదూరంగా ఉన్న డీప్ స్పేస్ క్లైమేట్ డిస్కవరీ అబ్జర్వేటరీ శాటిలైట్ ఈ చిత్రాలను నాసాకు పంపింది. భూమికి సుమారు లక్షా అరవైవేల కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఫోటోలు తీశారట. సూర్యకాంతి పడడంతో తెల్లగా, మంచు ముద్దలా కనిపించే చంద్రుడు, అదే కాంతి పడని వైపు బూడిద రంగులో కనిపిస్తున్నాడు.

More Telugu News