: ఈ ప్రొటీన్ ఎక్కువైతే మీ కిడ్నీలు దెబ్బతిన్నట్టే!

ప్రపంచ వ్యాప్తంగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ ఎక్కువ అవుతోంది. ఈ సమస్యలపై తాజాగా జరిగిన అధ్యయనంలో ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. మానవ శరీరంలో ఉండే 'ఆర్ టీఎన్1' అనే జన్యువు సగటు స్థాయికన్నా ఎక్కువైతే... అది 'రెటిక్యులాన్' అనే ప్రొటీన్ ను అధిక స్థాయిలో విడుదల చేస్తుందట. ఈ ప్రొటీన్ ఎక్కువైతే అది తీవ్రమైన కిడ్నీ సమస్యలకు కారణమవుతుందని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. రెటిక్యులాన్ ప్రొటీన్ కిడ్నీలోని కణజాలాలను ధ్వంసం చేస్తుందని... దీంతో, కిడ్నీలు పాడవుతాయని వెల్లడించింది. ఏయే జన్యువులు, ప్రొటీన్లు కిడ్నీలపై ప్రభావం చూపుతాయనే అంశంపై ఈ అధ్యయనం జరిగింది.

More Telugu News