: స్మార్ట్ ఫోన్ గేమ్స్ ఆడితే జ్ఞాపకశక్తి పెరగొచ్చు!

స్మార్ట్ ఫోన్ గేమ్స్ ఆడితే పిల్లల జ్ఞాపకశక్తి పెంపొందించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఇది పిల్లలందరకూ వర్తించదట. కేవలం స్కిజోఫ్రినియాతో బాధపడుతున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ గేమ్స్ ఆడడం ద్వారా మనోవైకల్యంతో బాధపడుతున్న పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వారు చేసిన పరిశోధనల్లో భాగంగా స్మార్ట్ ఫోన్ వీడియో గేమ్స్ ఆడడం వల్ల ఎపిసోడిక్ మెమరీని తిరిగి పొందవచ్చని నిరూపితమైందని తెలిపారు. సాధారణంగా కొన్ని వస్తువులు, ఇంటి తాళం, కారు తాళం వంటివి ఎక్కడో ఒకచోట పెట్టి మర్చిపోతుంటాం. ఇలా మర్చిపోవడాన్ని ఎపిసోడిక్ మెమరీ అంటారని వారు వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ వీడియో గేమ్స్ ఆడడం ద్వారా దీనిని పెంపొందించుకోవచ్చని వారు వెల్లడించారు.

More Telugu News