: సంతోషంగా జీవించాలంటే... మరీ 'మిస్టర్ పర్ ఫెక్ట్'గా ఉండొద్దు!

జీవితంలో పరిపూర్ణత్వాన్ని సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అందుకోసం శ్రమిస్తారు కూడా. అయితే, 'మిస్టర్ పర్ ఫెక్ట్' అని పిలిపించుకోవాలన్న తపనతో పడే కష్టం, ఒత్తిడికి గురి చేస్తుందని, ఆరోగ్య సమస్యలను సృష్టించడంతో పాటు జీవితకాలాన్ని హరిస్తుందని తాజాగా విడుదలైన అధ్యయనం వెల్లడించింది. ఈ తరహాలో ఆలోచించే వారు తమ మేధస్సుకు అనుక్షణం పదును పెడుతూ, అనారోగ్యాల బారిన పడుతున్నారని, తమవారి పట్ల శ్రద్ధను తగ్గించుకుంటున్నారని, ఒత్తిడిలో కూరుకుపోతున్నారని ఇంగ్లండులోని యార్క్ సెయింట్ జాన్ యూనివర్శిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఆండ్ర్యూ హిల్ హెచ్చరిస్తున్నారు. 'మిస్టర్ పర్ ఫెక్ట్'గా ఉండాలన్న కోరికతో వీరు చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూస్తూ, కుటుంబ బంధాలకు దూరమవుతున్నారని అన్నారు. గడచిన 20 సంవత్సరాలుగా 43 రకాల అధ్యయనాల ఫలితాలను సమీకరించి తాజా స్టడీ వివరాలు ప్రకటించినట్టు హిల్ తెలిపారు. కొన్ని సార్లు పనిలో పరాజయం పాలవుతున్నారని, బాగా చదివే వారు, ఆడేవారు విఫలమైన సందర్భాలూ ఉన్నాయని ఆయన అన్నారు. జీవితంలో నిత్య సంతోషిగా ఉండాలంటే మరీ 'మిస్టర్ పర్ ఫెక్ట్'గా ఉండకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు.

More Telugu News