: స్మార్ట్ నగరాలకు ఏడాదికి 100 కోట్లు...ఇప్పుడు 50 వేల కోట్లు: వెంకయ్యనాయుడు

దేశంలోని స్మార్ట్ సిటీల (ఆకర్షణీయ నగరాల) అభివృద్ధికి 50 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో నీతిఆయోగ్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీకి ఒక్కోదానికి వంద కోట్ల నిధులు కేటాయించనున్నామని అన్నారు. ప్రతి ఏటా వంద కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు ఆయా నగరాలకు కేంద్రం సహాయం చేస్తుందని ఆయన చెప్పారు. పట్టణాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. పట్టణాభివృద్ధిలో ప్రజలు పాలుపంచుకోవాలని ఆయన సూచించారు.

More Telugu News