: శిథిలావస్థకు చేరితే చార్మినార్ నైనా కూల్చాల్సిందే: డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

శిథిలావస్థకు చేరితే చార్మినార్ నైనా కూల్చేయాల్సిందేనని పురాతన భవనాలపై తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉస్మానియా ఆసుపత్రి పేరు మార్చకుండా బహుళ అంతస్తుల నూతన భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం వంద కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఆయన తెలిపారు. అయినా ప్రజలకు మ్యూజియంలు ముఖ్యమా? లేక ఆసుపత్రులు ముఖ్యమా? అనేది ఇతర పార్టీల నేతలే చెప్పాలని ఆయన అన్నారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేయకుండా అక్కడి ఖాళీ ప్రదేశంలో బహుళ అంతస్తుల భవంతులు నిర్మించాలని ఎంఐఎం సూచించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News