: కరెన్సీ నోట్లపై కలాం ఫోటో!... ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వైనం!

సాధారణంగా కరెన్సీ నోట్లపై మహాత్ముడి ఫోటో ఉంటుంది. అయితే ఇప్పుడు నోట్లపై మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం ఫోటో కనబడుతోంది. నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇలా ముద్రించిందా? అనే డౌట్ వస్తోంది కదూ, కానే కాదండీ... కరెన్సీ నోట్లపై మహాత్ముడి స్థానంలో ఈ 'మిస్సైల్ మ్యాన్' ఫోటోను మార్ఫింగ్ చేసిన నోట్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అంటే దేశమంతా కరెన్సీ నోట్లపై కలాం ఫోటో ఉండాలని కోరుకుంటున్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాంధీ తరువాత గత మూడు దశాబ్దాల నుంచి దేశ ఆధునిక అవసరాలు, సవాళ్లకు అనుగుణంగా ప్రజల్లో జాతీయవాదాన్ని రగిలించడంలో కలాం ఎంతో కృషి చేశారు. అందుకే జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాలు లేకుండా మహాత్ముడి తరువాత ఆయనకే దేశమంతా నివాళులర్పించింది. ఆయన అంత్యక్రియల సమయంలో జాతీయ జెండాను భౌతికకాయంపై ఉంచగా, పూర్తి సైనిక లాంఛనాలతో, వేలాది ప్రజలు 'భారత్ మాతా కి జై' అంటూ నినదిస్తుండగా అంత్యక్రియలు జరిగాయి. అంతటి ప్రేమాభిమానాలను అందుకున్న కలాంను... కరెన్సీ నోటుపై చూసుకోవాలనుకునే కోరిక నేటి యువతలో కనిపిస్తోందనడానికి ఇదే నిదర్శనం!

More Telugu News