: లాలూ 1000 గుర్రపు బండ్ల ప్రచారానికి బ్రేక్ వేస్తున్న 'పెటా'!

బీహార్ ఎన్నికల సమరాంగణంలో తనదైన శైలిలో దూసుకుపోవాలని ఆశించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు 'పెటా' రూపంలో విఘాతం ఎదురైంది. బీహార్ లో అధికారం చేజిక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ నేషనల్ చీఫ్ అమిత్ షా 160 హైటెక్ పరివర్తన్ రథాలను రంగంలోకి దించారు. ఈ రథాలను జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానించారు. వాటికి పోటీగా 1000 గుర్రపు బండ్లతో ప్రచారం నిర్వహించాలని లాలూ తలపోశారు. తమకు సంపన్నుల నుంచి విరాళాలు రావని, పేదలకు దగ్గరయ్యేందుకు ఇదే మార్గమని లాలూ భావించారు. రాష్ట్రంలోని గతుకుల రోడ్లపై ఇవే బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, గుర్రాలతో ప్రచారానికి తాము వ్యతిరేకమంటూ పెటా ఇండియా విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ పూర్వా జోషిపురా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో జంతువులను ఉపయోగించరాదని ఎన్నికల నియమావళి చెబుతోందని, లాలూ నిర్ణయం అందుకు విరుద్ధంగా ఉందని పెటా వర్గాలంటున్నాయి.

More Telugu News