: ఇక 'ఎన్టీఆర్ ఇళ్లు'... పేదల ఆవాసం కోసం ఏపీ సర్కారు కొత్త పథకం

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా పేదల గూడు కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసినా, ‘ఇందిరమ్మ ఇళ్లే’ కనిపించేవి. ఎందుకంటే, ఇందిరా ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతోధికంగా ఆర్థిక సహకారం అందుతోంది కాబట్టి. అయితే ఏపీలో నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు పేరిట... ‘ఎన్టీఆర్ ఇళ్లు’ పథకాన్ని ప్రారంభించేందుకు నిన్నటి కేబినెట్ భేటీ తీర్మానించింది. 275 చదరపు అడుగుల్లో రూ.2.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ ఇళ్లను ఏటా రెండు లక్షల చొప్పున కట్టించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏటా రూ.5,500 కోట్లను ఖర్చు చేయనుంది. ఇక ఇప్పటికే పలు పథకాల కింద నిర్మించిన పాత ఇళ్ల రిపేర్ల కోసం రూ.10 వేల చొప్పున ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

More Telugu News