: నిద్రలో కూడా ఫోన్ వీడడం లేదు

సాంకేతిక విప్లవంలో స్మార్ట్ ఫోన్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. స్మార్ట్ ఫోన్ యువతకు వ్యసనంగా మారిపోయింది. అరచేతిలో ప్రపంచం ఇమిడిపోవడంతో, స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడపలేకపోతున్నారు. భారత్, చైనా దేశాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ వినియోగంపై 'కేఆర్సీ' పరిశోధన బృందం ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, స్పెయిన్, మెక్సికో, చైనా, ఇండియా దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మొటరోలా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం... 74 శాతం మంది భారతీయులు, 70 శాతం మంది చైనీయులు తమ ఫోన్లను పట్టుకునే నిద్రిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు స్నానం చేసేటప్పుడు కూడా ఫోన్ వినియోగిస్తున్నారు. 40 శాతం మంది స్మార్ట్ పోన్ వినియోగదారులు తమ స్నేహితులతో పంచుకోని విషయాలను కూడా ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నారని సర్వే వెల్లడించింది. 39 శాతం మంది తమ స్మార్ట్ ఫోన్ తో సంతోషంగా ఉన్నామని చెబితే, మిగతా వాళ్లు తమ స్మార్ట్ ఫోన్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమైన పనుల్లో ఉండగా, ఫోన్ తమ దృష్టి మరలుస్తుందని పేర్కొన్నారు.

More Telugu News