: అమెరికన్ల పూర్వీకులు వీరేనట!... పరిశోధకుల పాత లెక్క తప్పింది

అమెరికన్లు సైబీరియా నుంచి 23 వేల ఏళ్ల క్రితం వలస వచ్చారని ఇప్పటిదాకా భావించారు. పరిశోధకుల ఈ పాత లెక్క తప్పని తాజా అధ్యయనాలతో తేలిపోయింది. అమెరికన్లు సైబీరియా నుంచి కాకుండా ఆస్ట్రేలియా నుంచి వలస వచ్చారని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని అమెజాన్ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల జన్యువులకు, ఆస్ట్రేలియాలోని గిరిజనుల జన్యువులకు సారూప్యత ఉందని తేలడంతో, కంగుతినడం శాస్త్రవేత్తల వంతు అయింది. బ్రెజిల్ లో నివసిస్తున్న స్థానిక అమెకన్ల జన్యువులపై పరిశోధనలు చేయగా... ఆస్ట్రేలియా, భారత్ కు చెందిన అండమాన్ నికోబార్ దీవులు, న్యూగినియాల్లోని గిరిజనుల జన్యువులతో సారూప్యత ఉందని తేలింది. దక్షిణ మధ్య అమెరికాకు చెందిన 21 స్థానిక అమెరికన్ సమూహాలు, బ్రెజిల్ లోని 9 రకాల సమూహాల నుంచి జన్యువులను సేకరించి... 200 అమెరికాయేతర సమూహాలతో శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. వీరి జన్యువులు ఏ సమూహంతోనూ సరిపోలేదు. కానీ, ఆస్ట్రేలియాలోని గిరిజనుల సమూహాలతో పోల్చి చూసినప్పుడు మాత్రం సరిగ్గా సరిపోయింది. దీంతో, అమెరికన్ల పూర్వీకులు సైబీరియన్లు కాదు... ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వారు అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

More Telugu News