: సంవత్సరానికి 385 రోజులతో రెండో భూమి ఉంది: కీలక ప్రకటన చేసిన నాసా

ఈ విశ్వంలో సుదూరంగా అచ్చు భూమిలాగానే ఓ గ్రహం ఉందని నాసా ప్రకటించింది. ఇది భూమికిమల్లే ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, దీనికి కెప్లర్-452బి అని పేరు పెట్టామని తెలిపింది. ఇది భూమికి 1,400 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వివరించారు. మన సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం భూపరిమాణంతో పోలిస్తే 60 శాతం పెద్దదని, ఆ గ్రహంపై ఉన్న వాతావరణ వివరాల గురించి కచ్చితంగా తెలియక పోయినా, రాళ్లతో నిండి భూమి కంటే ఐదు రెట్ల ఎక్కువ ద్రవ్యరాశిని కలిగివుండవచ్చని, ఈ గ్రహంపై ఒక సంవత్సరానికి 385 రోజులుంటాయని నాసా పేర్కొంది. భూమికన్నా 1.5 బిలియన్ సంవత్సరాల ముందు నుంచి ఇది ఉండివుండవచ్చని వివరించింది. ఈ గ్రహం మానవ నివాసానికి అనుకూలమా? కాదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని తెలిపింది.

More Telugu News