: ఆ టెక్నాలజీని 20 ఏళ్లకు స్వయంగా సాధించుకున్న శాస్త్రవేత్తలు

దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆ టెక్నాలజీని భారత్ కు ఇచ్చేందుకు అమెరికా ససేమిరా అంది. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు స్వీయ ప్రతిభతో దాన్ని సాధించుకున్నారు. అదే... రాకెట్ల ప్రయోగంలో వినియోగించే క్రయోజనిక్ ఇంజన్ టెక్నాలజీ. సమకాలీన ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ రాకెట్ ఇంజన్ ఇదే. ఈ క్రయోజనిక్ ఇంజనును స్వయంగా తయారు చేసుకున్న ఇస్రో దానిని 800 సెకన్ల పాటు పరీక్షించి మరో ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. ఈ ఇంజనును తదుపరి తరం మాన్ స్టర్ రాకెట్లో వాడి 8 టన్నుల బరువున్న శాటిలైట్లను నింగిలోకి పంపాలన్నది ఇస్రో ఆలోచన. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 ప్రయోగంలో తొలిసారిగా క్రయోజనిక్ ఇంజనును భారత్ వాడనుంది. 2016లో జరిగే జీఎస్ఎల్వీ ఎంకే-3 ప్రయోగానికి ఈ ఇంజనును వాడి విజయవంతం కావచ్చన్న నమ్మకం కలిగిందని రాకెట్ పరీక్షల అనంతరం ఇస్రో వ్యాఖ్యానించింది. లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ లను మండించడం ద్వారా నింగిలోకి దూసుకెళ్లే రాకెట్, ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీతో పోలిస్తే మరింత సమర్థవంతంగా, వేగంగా లక్ష్యాన్ని చేరుతుంది. క్రయోజనిక్ ఇంజన్ల తయారీకి భారత ప్రభుత్వం అనుమతించిన ఏడేళ్ల తరువాత తాము దీన్ని తయారు చేశామని శాస్త్రవేత్తలు వివరించారు.

More Telugu News