: పేర్లు కలిశాయని ఘనంగా పెళ్లి చేసిన కార్పొరేట్ కంపెనీ

కార్పొరేట్ కంపెనీలు చిత్రవిచిత్ర ప్రచారాలతో వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటాయి. కంపెనీ పేరుతో ఓ జంట పేర్లు కలిశాయని వారి వివాహానికయ్యే ఖర్చును కార్పొరేట్ కంపెనీ భరించడం విశేషం. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రానికి చెందిన బర్గర్-కింగ్ దంపతులయ్యేందుకు అవసరమైన ఖర్చు మొత్తాన్ని అతి పెద్ద ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తిదారు బర్గర్ కింగ్ సమకూర్చింది. వివాహానికి కంపెనీకి సంబంధం ఏమిటంటే కేవలం పేర్లు కలవడమే. బాల్య స్నేహితులైన జోల్ బర్గర్, ఆష్లే కింగ్ లు బర్గర్-కింగ్ గా ఇల్లినాయిస్ లో ఫేమస్. వీరిద్దరూ బర్గర్ కింగ్ సైన్ బోర్డ్ పట్టుకుని తీసుకున్న ఫోటోను వివాహానికి సంబంధించిన వ్యాఖ్యతో ఫేస్ బుక్ లో పెట్టారు. దీనిని చూసిన బర్గర్-కింగ్ కంపెనీ సిబ్బంది వారిని సంప్రదించి, వివాహానికయ్యే ఖర్చు మొత్తం అందిస్తామని చెప్పారు. అందుకు ప్రతిగా బర్గర్-కింగ్ పేరిట ముద్రించిన టీషర్టులను వేసుకోవాలని కోరింది. దానికి వారు అంగీకరించడంతో వారి వివాహాన్ని బర్గర్-కింగ్ కంపెనీ ఘనంగా నిర్వహించింది.

More Telugu News