: అమ్మాయి అందం, డాక్టర్ మొహమాటం... స్టెతస్కోప్ పుట్టుకకు కారణాలివే!

'నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' అంటారు. అంటే... అవసరమే ఆవిష్కరణలకు అమ్మలాంటిదని అర్థం. సరిగ్గా ఇలాంటి సందర్భమే వైద్య రంగంలో అత్యంత కీలకమైన స్టెతస్కోప్ సృష్టికి కారణమైంది. అవి 19వ శతాబ్దపు ప్రారంభ రోజులు. ఒక రోజు ఫ్రెంచ్ ఫిజీషియన్ అయిన రెన్ లీయెనిక్ వద్దకు వైద్య పరీక్షల కోసం ఓ అందమైన అమ్మాయి వచ్చింది. తను చెప్పిన వివరాలను బట్టి... ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోందని లీయెనిక్ ఓ నిర్ధారణకు వచ్చాడు. చికిత్స నిమిత్తం ఆమె హార్ట్ బీట్ ను లెక్కించాల్సి ఉంది. ఆ రోజుల్లో హృదయ స్పందనను లెక్కించాలంటే... ఛాతీపై చెవి ఆనించి గెండె చప్పుడు వినాల్సిన పరిస్థితి ఉండేది. ఎదురుగా ఉన్నది ఓ అందమైన అమ్మాయి. యుక్త వయసులో ఉన్న ఆమె ఛాతీపై చెవి ఉంచడానికి లీయెనిక్ కు ఎక్కడ లేని సిగ్గు, మొహమాటం వచ్చేసింది. దీంతో, కాసేపు ఆలోచించి... కాగితాన్ని స్థూపాకారంలో చుట్టాడు. ఓ అంచును ఆమె ఛాతీపై పెట్టి, మరో అంచును చెవికి ఆనించి, గుండె చప్పుడు విన్నాడు. ఈ పద్ధతి ద్వారా కూడా గుండె చప్పుడును చక్కగా వినొచ్చనేది లీయెనిక్ కు అర్థమైంది. స్టెతస్కోప్ సృష్టికి ఇక్కడే అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత ఈ ఆలోచనల నుంచే 1816లో స్టెతస్కోప్ పుట్టింది.

More Telugu News