: వీడియో గేమ్ ఎంత పని చేసింది... 500 యూరోల జరిమానా!

అలవాటు వ్యసనంగా మారితే ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన చెబుతుంది. జర్మనీ లోని బెర్లిన్ కి చెందిన ఓ యువకుడు 2014 ఆగస్టులో ఓ రోజు ఉదయం తన ఇంట్లో స్నేహితుడితో కలిసి వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో అక్కడికి అతని ప్రియురాలు వచ్చింది. తన గేమ్ కి ఆమె ఎక్కడ అడ్డుతగులుతుందోనన్న ఉద్దేశంతో, ఆమెకు టీలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. దాంతో ఆమె హాయిగా నిద్రపోయింది. మరుసటి రోజు మధ్యాహ్నం నిద్రలేచి, జరిగింది గ్రహించింది. దీంతో, అతనిపై న్యాయస్థానంలో కేసు వేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం అతనికి 500 యూరోలు జరిమానా విధించింది. టీలో మత్తుమందు కలపడం వెనుక దురద్దేశం లేనప్పటికీ, ఆ మత్తుమందు ప్రభావం ఇప్పుడు చూపనప్పటికీ, భవిష్యత్ లో ఆమెపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని, ఆమెకు నష్టపరిహారంగా 500 యూరోలు చెల్లించాలని న్యాయస్థానం అతడిని ఆదేశించింది.

More Telugu News