: యూరో జోన్, గ్రీస్ రాజీకి రావాలి: అమెరికా

యూరో జోన్, గ్రీస్ లు రాజీకి రావాలని ప్రపంచ పెద్దన్న అమెరికా సూచించింది. తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన గ్రీస్ తో యూరోపియన్ యూనియన్ దేశాలు రాజీ ఒప్పందం చేసుకోవాలని అమెరికా పిలుపునిచ్చింది. గ్రీస్ యూరో జోన్ లో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నామని వైట్ హౌస్ అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. వాషింగ్టన్ డీసీలో ఆయన మాట్లాడుతూ, యూరో జోన్ అధికారులు, గ్రీస్ పరస్పరం సంస్కరణలకు అంగీకరించి, గ్రీస్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని సూచించారు. కాగా, యూరో జోన్ పెడుతున్న షరతులపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యూరో జోన్ నుంచి గ్రీస్ బయటకు రావాలని అక్కడి ప్రజలు స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో చర్చలు ఎటువైపు మళ్లుతాయోననే ఉత్కంఠ రేగుతోంది.

More Telugu News