: బంగారం నేలచూపులు... తగ్గిన ధర!

మంగళవారం నాడు పుత్తడి ధర మరోసారి తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు ఒడిదుడుకులకు లోనవుతుండడంతో నూతన కొనుగోళ్లకు ట్రేడర్లు, స్టాకిస్టులు దూరంగా ఉన్నారు. దీంతో, పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే, రూ.70 తగ్గి రూ.26,500కి చేరింది. బంగారానికి డిమాండు తగ్గిందని బులియన్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో అటు అమ్మకాలు, ఇటు కొనుగోళ్లు సన్నగిల్లడంతో వెండి ధర దాదాపు స్థిరంగా నిలిచింది. కిలో వెండి ధర రూ.36 వేల వద్ద కొనసాగుతోంది. తదుపరి సెషన్లలో సైతం బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News