: మన సినిమాలు, మన సంగీతం ఉజ్బెకిస్థాన్ లో చాలా పాప్యులర్: మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఉజ్బెకిస్థాన్ వెళ్లిన మోదీ అక్కడి అధినాయకత్వంతో భేటీ అయ్యారు. దేశాధ్యక్షుడు ఇస్లామ్ కరిమోవ్ తో సమావేశమవడమే కాకుండా, ఆయన ఆతిథ్యం అందుకున్నారు. తాష్కెంట్ నగరంలో మోదీకి ఘనంగా విందునిచ్చారు. వెజిటబుల్ పలావ్, బ్రాకోలీ క్రీమ్ సూప్, స్టీమ్డ్ రైస్, ఉడికించిన కూరగాయలు ఈ విందులో వడ్డించారు. తన పర్యటనపై మోదీ ట్వీట్ చేశారు. మన సినిమాలు, మన భాష, మన సంగీతం ఉజ్బెక్ లో చాలా పాప్యులర్ అని తెలిపారు. 2012లో ఉజ్బెక్ రేడియో హిందీ ప్రసారాలకు 50 వసంతాలు పూర్తయ్యాయని కూడా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక, మోదీ ఉజ్బెక్ అధ్యక్షుడు కరిమోవ్ కు సుప్రసిద్ధ కవి, సూఫీ గాయకుడు అమీర్ ఖుస్రోవ్ రచనలను కానుకగా ఇచ్చారు. ఖుస్రోవ్ కు, ఉజ్బెక్ కు ఉన్న లింకును కూడా ట్వీట్ ద్వారా తెలిపారు. ఖుస్రోవ్ తండ్రి ఉజ్బెక్ నుంచి వచ్చాడన్న విషయాన్ని వివరించారు.

More Telugu News