: ఓటుకు నోటు కేసులో మరో కొత్త పేరు... ఎవరీ జనార్దన్?

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ రిపోర్టులో మరో కొత్త పేరును తెలంగాణ ఏసీబీ ప్రస్తావించింది. ఓటుకు నోటు కేసులో జనార్దన్ దృష్టికి సండ్ర ప్రతి విషయాన్నీ తీసుకువెళ్లారని, ఆయన ఎవరన్న విషయాన్ని తేల్చాల్సి వుందని తెలిపింది. కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్రలు మే 27 నుంచి 31 మధ్య 32 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారని, వీటిల్లో పలుమార్లు జనార్దన్ పేరు వినిపించిందని ఏసీబీ పేర్కొంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కొన్ని కీలక భేటీలు జరిగాయని వెల్లడించిన ఏసీబీ, మొత్తం వ్యవహారాన్ని నడిపించింది సండ్రేనని, 30వ తేదీ ఆపరేషనుకు మాత్రం రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపారని తెలిపింది. ఆయన్ను కస్టడీకి ఇస్తే మరింత సమాచారం సేకరిస్తామని పేర్కొంది.

More Telugu News