: వివాహేతర బంధమైతే జనన ధ్రువీకరణలో తండ్రి పేరు తప్పనిసరి కాదు: సుప్రీం కీలక ఆదేశం

వివాహేతర సంబంధాలు లేక వివాహం కాకుండానే జన్మించిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే సమయంలో తండ్రి పేరును తెలియజేయాలని ఒత్తిడి తేవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా కేసులో కేవలం తల్లిపేరును మాత్రమే రాస్తే సరిపోతుందని తెలిపింది. ఇటీవలి కాలంలో మహిళలు తమ పిల్లలను ఎవరి సాయమూ లేకుండానే పెంచి పెద్దచేసే శక్తిని సంపాదించుకుంటున్నారని, అందువల్ల మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలూ మారాల్సి వుందని ఓ కేసు విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. బిడ్డ తల్లి విషయంలో ఏ విధమైన అనుమానాలూ ఉండవని, అందువల్లే తల్లి ఒక్కరే లేదా అవివాహిత తల్లి కూడా బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, బిడ్డకు తల్లి ఆమేనన్న ధ్రువపత్రాన్ని మాత్రం ఆసుపత్రి నుంచి లేదా అఫిడవిట్ రూపంలో అందించాల్సి వుంటుందని వివరించింది. తల్లిదండ్రుల బంధం తెగిపోయిందన్న కారణంతో ఏ చిన్నారి కూడా అశ్రద్ధకు గురికాకూడదన్న ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.

More Telugu News