: ఆ వీడియోలను అప్ లోడ్ చేసేది బెంగళూరు సంపన్న యువకుడట!

సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వీడియోలను అప్ లోడ్ చేస్తున్న కేసులో బెంగళూరులోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన కౌశక్ కౌనర్ (20)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ యువతితో గడిపిన వీడియోను ఎడిట్ చేసి కౌశక్ సోషల్ మీడియా వాట్స్ యాప్ లో అప్ లోడ్ చేశాడు. ఇది బాగా సర్క్యులేట్ కావడంతో, హైదరాబాదుకు చెందిన ఎన్జీఓ ప్రజ్వల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెల్.ఎల్.దత్తుకు లేఖ రాసింది. ఈ లేఖను సుమోటోగా తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి విచారించాలని సీబీఐని ఆదేశించారు. దీంతో అధునాతన ఫోరెన్సిక్ సాప్ట్ వేర్ను ఉపయోగించి ఈ అభ్యంతరకర వీడియోల మూలాలని సీబీఐ కనుగొంది. భారత మహిళల అశ్లీల వీడియోలను కౌశక్ డౌన్ లోడ్ చేసి, వాటిని ఎడిట్ చేసి తిరిగి ఇంటర్ నెట్ లో పోస్ట్ చేసేవాడని సీబీఐ విచారణలో తేలింది. సుమారు 470 వీడియోలను, అత్యాధునిక ఎడిటింగ్ సాఫ్ట్ వేర్, హార్డ్ డిస్క్, రహస్య కెమరాలను నిందితుడి నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుంది.

More Telugu News