: నిద్రలేమితో స్వీయ నియంత్రణ కోల్పోతారు

నిద్రలేమి కారణంగా స్వీయ నియంత్రణ కోల్పోతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమిపై చేసిన పరిశోధనల్లో అమెరికాలోని క్లెమ్సన్ యూనివర్సిటీ పరిశోధకులు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. నిద్ర లేమి కారణంగా వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో స్వీయ నియంత్రణ కోల్పోతారని తెలిపారు. నిర్ణయాధికారంలో స్వీయ నియంత్రణ కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. పరస్పర విరుద్ధమైన కోరికలు, అవకాశాలు మన ముందు ఉన్నప్పుడు దేనిని ఎంచుకోవాలో స్వీయ నియంత్రణ సూచిస్తుందని వారు వెల్లడించారు. ఈ స్వీయ నియంత్రణలో నిద్ర అనేది కీలక పాత్ర పోషిస్తుందని వారు స్పష్టం చేశారు.

More Telugu News