: చేదు జ్ఞాపకాలను సులువుగా మర్చిపోవచ్చు

చేదు జ్ఞాపకాలు అంత త్వరగా మనల్ని వీడిపోవు. కొన్నిసార్లు ఈ జ్ఞాపకాలు మన ప్రశాంతతను చెడగొడతాయి. అయితే వీటిని మర్చిపోయేందుకు సమర్థవంతమైన చిట్కాను యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు సూచిస్తున్నారు. కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటే చేదు జ్ఞాపకాల నుంచి విముక్తి లభిస్తుందని వీరు సూచిస్తున్నారు. సాధారణంగా చేదుజ్ఞాపకాలు మెదడుకు అయిన గాయాల వల్ల ఏర్పడతాయని వారు వెల్లడించారు. మెదడులో గాయాలున్నవారు అవాంఛిత దృశ్యాలను చూసేందుకు ఇష్టపడరని వారు పేర్కొంటున్నారు. కంప్యూటర్ గేమ్స్ ఆడడం వల్ల మెదడు చేదు జ్ఞాపకాలను వదిలించుకుంటున్నట్టు తమ పరిశోధనల్లో వెలుగు చూసిందని వారు తెలిపారు.

More Telugu News