: జూన్ 30వ తేదీన 86,401 సెకన్లు!

ఒక రోజులో ఎన్ని సెకన్లుంటాయి? ఇదేం ప్రశ్న... దీనికి చిన్నప్పుడే సమాధానం తెలుసు, రోజులో 86,400 సెకన్లుంటాయని అంటారా? మిగతా అన్ని రోజులకూ ఓకే కానీ, ఈ సంవత్సరం జూన్ 30కి మాత్రం కాదు. ఆ రోజున గడియారాన్ని ఒక సెకను అధికంగా తిప్పాలని నాసా నిర్ణయించింది. అందుకు ఓ కారణాన్ని కూడా చెప్పింది. భూ భ్రమణ వేగం అత్యంత నిదానంగా తగ్గుతుండటమే ఇందుకు కారణమట. అందువల్లే అదనపు సెకను లేదా 'లీప్' సెకనును చేర్చాలని నిర్ణయించినట్టు నాసా పేర్కొంది. ప్రస్తుతం భూమి తనచుట్టూ తాను తిరగడానికి 86,400.002 సెకన్ల సమయం పడుతోందని వివరించింది. 1820 సంవత్సరం తరువాత ఏనాడు సరిగ్గా 86,400 సెకన్లకు భూమి తన భ్రమణాన్ని పూర్తి చెయ్యలేదని తెలిపింది. ప్రతిరోజూ అర్ధరాత్రి 23:59:59 తరువాత సమయం 00:00:00కు మారి మరుసటి రోజు ప్రారంభమవుతుందని, 30వ తేదీన 23:59:59 తరువాత కలిపే ఒక సెకనూ 29:59:60 అని వ్యవహరించి, ఆపై 00:00:00తో రోజు మారుతుందని ప్రకటించింది.

More Telugu News