: ప్రపంచంలోనే 'స్లిమ్మెస్ట్' ఫోన్ ను లాంఛ్ చేసిన మైక్రోమ్యాక్స్

ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ భారత్ లో ఈరోజు ప్రపంచంలోనే 'స్లిమ్మెస్ట్' (అతి పలచని) ఫోన్ ను విడుదల చేసింది. 'స్మార్ట్ఫోన్ కాన్వాస్ సిల్వర్ 5' పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ప్రపంచంలోనే ఈ ఫోన్ డివైస్ స్లిమ్ గా, తేలికగా ఉంటుందని మ్యాక్స్ తెలిపింది. 97 గ్రాముల బరువుండే ఈ ఫోన్ డివైస్ 5.1 మిల్లీ మీటర్ మందంతో ఉంటుంది. అంతేగాక ఈ డివైస్ కు లాంగ్ టర్మ్ ఎవల్యూషన్, సోనీ ఎక్స్ మోస్ సీఎంఓఎస్ చిప్ అటాచ్డ్ కెమెరా, బ్లూ ఫ్లిట్టర్ ఉంటాయి. వాటితో పాటు ఏఎంఓఎల్ఈడీ (యాక్టివ్-మాట్రిక్స్ ఆర్గానిక్ లైట్- ఎమ్మిటింగ్ డయోడ్), ఈ ఫోన్ నలుపు, తెలుపు రంగులలో లభ్యమవుతుంది. ఇంకా పలురకాల ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

More Telugu News