: భూకంపాల్లానే చంద్రకంపాలు వస్తాయి: ఇస్రో

భూమి మీద వచ్చినట్టే చంద్రుడి మీద ప్రకంపనలు పుడతాయని ఇస్రో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 తీసిన చంద్రుని ఉపరితల చిత్రాలను విశ్లేషించిన ఇస్రో ఈ విషయం వెల్లడించింది. భూమి మీద ఉన్నట్టే చంద్రుని ఉపరితం మీద కూడా టెక్టోనిక్ ప్లేట్స్ ఉన్నాయి. ఇవి ఒకదానికొకటి ఢీ కొని ప్రకంపాలకు దారితీస్తాయని జేఎన్ యూ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ జియాలజీ, రిమోట్ సెన్సింగ్ ప్రొఫెసర్ సౌమిత్ర ముఖర్జీ తన స్టూడెంట్ ప్రియదర్శిని సింగ్ తో కలిసి చేసిన పరిశోధనలో తేలింది. చంద్రయాన్-1 ఆర్బిటర్ తీసిన చిత్రాలను వీరు విశ్లేషించారు. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం నుంచి సేకరించిన డేటాను పరిశీలించారు. అక్కడ టెక్టోనిక్ చర్యలు భూమిపై మాదిరిగానే ఉన్నాయనడానికి చాలా ఆధారాలు లభించాయని ముఖర్జీ చెప్పారు. ఇస్రో అహ్మదాబాద్ కు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ వీరి పరిశోధనలకు సహకారమందించాయి. ఈ పరిశోధనలు నేచర్ ఇండియా, ఫ్రాంటియర్స్ ఎర్త్ సైన్స్ తదితర జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.

More Telugu News