: స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేక మార్గం

స్మార్ట్ ఫోన్ వాడకం మొదలైన తరువాత యువత దానికి అతుక్కుపోతున్నారు. ఏ పనిలో ఉన్నా స్మార్ట్ ఫోన్ వదలడం లేదంటే అతిశయోక్తి కాదు. బెల్జియంలోని ఆంట్వెర్ప్ సిటీలో రద్దీగా ఉండే ఓ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ వాడకందారులు ఒకరినొకరు ఢీకొట్టుకోవడం మరీ ఎక్కువైపోయింది. దీంతో వీరికోసం వీధుల్లోని రోడ్లపై ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వాహనాలకు డివైడర్ మాదిరిగా వీధి మధ్యలో రెండు గీతలతో ‘టెక్స్ట్ వాకింగ్ లేన్’ వేశారు. స్మార్ట్‌ ఫోన్ యూజర్లు ఈ లేన్‌ లోనే నడుచుకుంటూ వెళ్లాలి. అయితే ఈ నిబంధనను కూడా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పట్టించుకోవడం లేదు. ఎప్పటిలాగే అడ్డదిడ్డంగా నడుస్తూ ఎదురుగా వస్తున్నవారిని ఢీకొడుతున్నారట. అమెరికాలోని వాషింగ్టన్, చైనాలోని చోంగ్‌ క్వింగ్ నగరాల్లో కూడా ఇలాంటి లేన్లు వేశారు. లేన్లు వేసినప్పటికీ వినియోగదారులు వీటిని పాటించకపోతే ఉపయోగం లేదని ఈ వీధుల్లో నడిచిన వారికెవరికైనా తెలిసిపోతుంది. భారత్ లోని కొన్ని నగరాల్లో కూడా ఇలాంటి ఢీ కొట్టడాలు ఎక్కువైపోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి.

More Telugu News