: ఇండియా కోసం ప్రత్యేకంగా గూగుల్ కొత్త ఫీచర్

డేటా స్పీడ్ తక్కువగా ఉండే ఇండియా వంటి దేశాల కోసం గూగుల్ కొత్త ఫీచర్ ను ప్రారంభించనుంది. డేటా కనెక్షన్ స్లోగా ఉన్నప్పటికీ, వేగంగా వెబ్ పేజీలు లోడ్ అవడానికి ఈ ఫీచర్ తోడ్పడుతుంది. మరో రెండు వారాల్లోగా, అంటే ఈ నెలాఖరు నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని, భారత్ తో పాటు, డేటా సమస్యలు తీవ్రంగా ఉన్న బ్రెజిల్ లోనూ ఈ ఫీచర్ ను విడుదల చేస్తామని గూగుల్ చెబుతోంది. ఈ ఫీచర్ ను వాడితే డేటా ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందని సంస్థ సెర్చ్ ప్రొడక్టు మేనేజర్ హిరోతో తొకుసీ తెలిపారు. యూజర్లకు మరింత బ్రౌజింగ్ అనుభూతిని కల్పించే లక్ష్యంతోనే కొత్త ఫీచర్ రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన వివరించారు. 2018 నాటికి భారత్ లో ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య 55 కోట్లను దాటుతుందని గూగుల్, ఫేస్ బుక్ తదితర కంపెనీలు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News