: ఫేస్ బుక్ 'తమ్ముడు' వచ్చాడు!

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారిత స్మార్ట్ ఫోన్లలో ఫేస్ బుక్ లోడ్ కావడానికి, అప్ డేట్ కావడానికి సమయం ఎక్కువ పడుతోందని భావిస్తున్నారా? మీ బాధ తీర్చడానికి ఫేస్ బుక్ 'తమ్ముడు' వచ్చేశాడు. స్మార్ట్ ఫోన్లలో మరింత వేగవంతమైన అనుభూతిని, నెట్ వర్క్ నిదానంగా ఉన్నా, స్ట్రీమింగ్ ఆగకుండా ఉండేలా రూపొందించిన 'ఫేస్ బుక్ లైట్'ను మార్కెట్లోకి విడుదల చేసినట్టు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఈ యాప్ కేవలం 1 మెగాబైట్ కన్నా తక్కువ బరువు ఉంటుందని, కొన్ని సెకన్లలోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ అతి తక్కువగా ఉన్నా, ఈ యాప్ వేగంగానే నడుస్తుందని ఆయన వివరించారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరప్ దేశాల్లో ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించారు.

More Telugu News