: భవిష్యత్తులో మనిషి మృత్యుంజయుడే!

భవిష్యత్తులో మనిషికి మరణం అనేది ఉండదంటున్నారు జెరూసలెంలోని హిబ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్ యువల్ నోవా హరారి. బయోటెక్నాలజీ, జెనెటికల్ ఇంజినీరింగ్ సాయంతో మనిషి మృత్యువును జయిస్తాడని, మరో 200 ఏళ్లలో ఇది సాధ్యమవుతుందని హరారి ధీమాగా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సగం మనిషి, సగం యంత్రం తరహా సైబోర్గ్ లు వస్తాయని, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటే ఇక చావు అనేది దగ్గరకు కూడా రాదని తెలిపారు. అయితే, ఇది ధనవంతులకు మాత్రమే సాధ్యమని, ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. ఈ దిశగా ప్రయోగాలు ప్రారంభమయ్యాయని, చావును జయించడం అసాధ్యమేమీ కాదని హరారి చెప్పారు. అప్పుడు... జననమరణాలపై మనిషికి పూర్తి అదుపు ఉంటుందని స్పష్టం చేశారు. భూమిపై జీవం మొదలయ్యాక, ఇది మహోన్నత ఆవిష్కరణ అవుతుందని పేర్కొన్నారు.

More Telugu News