: తొలగనున్న కిరోసిన్ సబ్సిడీ... నొప్పి లేకుండా బాదేందుకు మోదీ సర్కారు యత్నాలు!

ఇంధన సంస్కరణల్లో భాగంగా కిరోసిన్ పై సబ్సిడీని తొలగించే దిశగా మోదీ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, ఎటువంటి విమర్శలు రాకుండా, పేదలకు 'నొప్పి' తెలియకుండా ఈ పని చేయాలని ఇప్పటికే మోదీ అధికారులకు తెలియజేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఈఎంసీ (ఎక్స్ పెండిచర్ మేనేజ్మెంట్ కమిషన్) ఓ ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రధాని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ దీన్ని రూపొందించారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. కిరోసిన్ ను తక్కువ ధరకు అందించడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు 2014-15లో రూ. 24,799 కోట్ల నష్టాన్ని భరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓఎంసీలు లీటరు కిరోసిన్ ను రూ. 16.32కు విక్రయిస్తున్నాయి. గత కొంత కాలంగా కిరోసిన్ విక్రయాలు స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి. రాజస్థాన్ లో ఏకంగా 67 శాతం మేరకు కిరోసిన్ అమ్మకాలు తగ్గాయి. విద్యుత్, వంటగ్యాస్ లభ్యత మెరుగుపడడమే ఇందుకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఇక కిరోసిన్ పై సబ్సిడీని తొలగించడం ద్వారా ఇంధన సంస్కరణల విషయంలో కీలక అడుగు వేయాలన్నది మోదీ ఆకాంక్ష.

More Telugu News