: నిధుల విషయంలో కడియం, ఎర్రబెల్లి వాగ్వాదం

తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోందని విమర్శించారు. విపక్ష ఎమ్మెల్యేల నియోజక వర్గాలకు అవసరమైన నిధులు కేటాయించడం లేదని ఆయన ఆరోపించారు. పాలకుర్తి నియోజక వర్గానికి నిధులు కేటాయించకుండా కడియం శ్రీహరి మోకాలడ్డుతున్నారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలు కార్యక్రమాలు ఆగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న కడియం శ్రీహరి ఎర్రబెల్లి ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వానికి పక్షపాతం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపడం లేదని మరోసారి కడియం స్పష్టం చేశారు.

More Telugu News